ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ .. Brindavanam Telugu Movie Songs Lyrics - S. Janaki, Balasubramaniam S.P.
Singer | S. Janaki, Balasubramaniam S.P. |
Composer | |
Music | Madhava Peddi Suresh |
Song Writer | Vennelagamti |
Lyrics
Aa Roju Naa Raani Sirunavvu Soosi
Title (Indic) | ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి |
---|---|
Role | Artist |
---|---|
Music | Madhava Peddi Suresh |
Performer | S. Janaki |
Balasubramaniam S.P. | |
Writer | Vennelagamti |
పల్లవి:
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
ఎద జివ్వున లాగింది లవ్వనీ
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
ఎద జివ్వున లాగింది లవ్వనీ
చరణం 1:
ఆ రోజు జాబిల్లి పగలే వచ్చిందీ
ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపు వలలే వేసింది
ఈ రోజు మాపుల్లో కలలే దోచింది
కన్నులే వెన్నెలాయే..వన్నెలే వెన్నలాయే
ముద్దులా ముచ్చటాయే..నిద్దరే పట్టదాయే
ఈ రోజే నాకు తెలిసింది ఈ చిత్రాలు చేసింది లవ్వనీ..
మధుపత్రాలు రాసింది లవ్వనీ
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
ఎద జివ్వున లాగింది లవ్వనీ
చరణం 2:
ఆ రోజు కలలోనా తొణికే నా ప్రేమా
ఈ రోజు ఇలలోనా నిజమే చేద్దామా
ఆ రోజు మెరిసిందీ అందం చిరునామా
ఈ రోజు కలిసిందీ జతగా ఈ భామా
గుండెలో అల్లరాయే.. ఎండలే చల్లనాయే
ఆశలే వెల్లువాయే..ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసిందీ రాగాలు రేపింది లవ్వనీ..
అనురాగాలు చూపింది నువ్వనీ
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
ఎద జివ్వున లాగింది లవ్వనీ
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వనీ
ఈ రోజే నాకు తెలిసిందీ ఆ నవ్వున దాగుంది లవ్వనీ..
ఎద జివ్వున లాగింది లవ్వనీ|
Social Plugin