Mastaaru Mastaaru Lyrics –

Dhanush Sir Song: ‘మాస్టారు మాస్టారు’ సాంగ్ లిరిక్స్.. Lyrics - Dhanush


Dhanush Sir Song: ‘మాస్టారు మాస్టారు’ సాంగ్ లిరిక్స్..
Singer Dhanush
Composer
Music GV Prakash Kumar
Song WriterRamajogayya Sastry

Lyrics

సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) రాసిన అచ్చ తెలుగు పాట ఇది. తమిళంలో ఈ పాటకు హీరో ధనుష్ (Dhanush) స్వయంగా సాహిత్యం అందించారు. తమిళ లిరిక్స్ ధనుష్ స్టైల్‌లో అరవం, ఆంగ్లం మిళితమై ఉన్నాయి. కానీ, తెలుగులో మాత్రం రామజోగయ్య శాస్త్రి అచ్చ తెలుగు సాహిత్యం అందించారు. దీనికి కన్నడ గాయని శ్వేతా మోహన్ గాత్రం తోడవడంతో పాటకు మరింత అందం వచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ బాణీ కట్టిపడేస్తుంది.





‘సార్’లో ధనుష్, సంయుక్త



ధనుష్ హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. మలయాళ నటి సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ద్విభాషా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు’ అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. తమిళంలో ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా రాశారు. ‘వా వాతీ’ అంటూ సాగే ఈ పాట తెలుగు వెర్షన్‌ను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించారు.



‘మాస్టారు మాస్టారు’ పాటకు రామజోగయ్య శాస్త్రి అచ్చ తెలుగు సాహిత్యం అందించారు. రాంజో సాహిత్యంలోని ప్రతి పదం మన మనసును హత్తుకుంటుంది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాట లిరిక్స్‌ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. సాహిత్యాన్ని పాటగా మీరు ఆలపించడానికి ఆర్టికల్ చివరలో లిరికల్ వీడియోను కూడా పొందుపరిచాం.




పల్లవి

శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే

సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే

నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే

అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే

ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు



చరణం

ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..

ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..

ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..

చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా



గుండెపై అలా నల్లపూసలా

వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..

ఒంటి పేరుతో ఇంటి పేరుగా

జంటగా నిను రాయాలంటున్నా..



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు




Dhanush Sir Song: ‘మాస్టారు మాస్టారు’ సాంగ్ లిరిక్స్.. Watch Video