ఊరూ పల్లెటూరు పాట సాహిత్యం - బలగం Lyrics - Ram Miriyala
Singer | Ram Miriyala |
Composer | |
Music | Bheems Ceciroleo |
Song Writer | Kasarla Shyam |
Lyrics
ఊరూ పల్లెటూరు పాట సాహిత్యం - బలగం
Ooru Palletooru Lyrics Ooru Palletooru Song Lyrics Ooru Palletooru
Ooru Palletooru Song Lyrics From Balagam Movie
Lyrics Of Ooru Palletooru Song From Balagam Movie
Balagam Songs Lyrics Balagam Movie Songs Lyrics
Balagam Movie Lyrics Balagam Lyrics
--------------------
Songs Sung by Satyavathi Rathod(Mangli) & Ram Miriyala
Songs Lyrics by Kasarla Shyam
Songs Music by Bheems Ceciroleo
---------------------
ఓరి వారి.. ఇంక పిండుతున్నావురా పాలు..
ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీయక్క
ఇగ పొద్దు పొద్దునే మొదలెట్టినావురా.. నీ పాసుగాల
కోలో నా పల్లే.. కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే.. కోడె లాగల్లే
యాప పుల్లల.. చేదు నమిలిందే
రామ రామ రామ రామా
తలకు పోసుకుందే.. నా నేల తల్లే
అలికి పూసుకుందే.. ముగ్గు సుక్కల్లే
సద్ది మూటల్లే.. సగ బెట్టుకుందే..
బాయి గిరక.. నా పల్లే
హేయ్.. తెల్లా తెల్లాని పాల దారలల్ల..
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన..
జంటగ మోగుత ఉంటాయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే.. దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోధా పక్కన ఉంటే.. కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా.. సేను సెలకల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మలా.. రాలుతున్న పూల సప్పట్లు
గడ్డి మోపులు.. కాల్వ గట్టులు..
సెమట సుక్కల్లొ తడిసిన.. ఈ మట్టి గంధాలు
ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు
కొంగులోనా దాసిపెట్టీ.. కొడుకు కిచ్చే ప్రేమ వేరు
ఊరూ పల్లెటూరు.. దీని తీరే కన్న కూతురు
కండ్ల ముందే.. యెదుగుతున్నా సంబరాల పంట పైరు
వంద గడపలా మంద నా పల్లే
గోడ కట్టని గూడు నా పల్లే
సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే
రామ రామ రామ రామా
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలొ ఒదిగిన పూల దండల్లే.. రంగుల సింగిడి పల్లే
ఆలు మొగలు ఆడే ఆటలూ.. అత్త కోడండ్ల కొట్లాటలూ
సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలూ
రచ్చ బండ మీద ఆటలూ.. ఛాయబండి కాడ మాటలూ
వొచ్చి పోయెటోల్ల మందలించుకొనే.. సంగతే గమ్మతీ
తట్టబుట్టలల్ల కూరతొక్కులూ.. సుట్ట బట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు..
మావి పూట కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగదే.. సచ్చేదాక ఉంటంది యాది
ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు
కొంగులోనా దాసిపెట్టీ.. కొడుకు కిచ్చే ప్రేమ వేరు
ఊరూ పల్లెటూరు.. దీని తీరే కన్న కూతురు
కండ్ల ముందే.. యెదుగుతున్నా సంబరాల పంట పైరు
వంద గడపలా మంద నా పల్లే
గోడ కట్టని గూడు నా పల్లే
సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే
రామ రామ రామ రామా
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలొ ఒదిగిన పూల దండల్లే.. రంగుల సింగిడి పల్లే
Movie : Balagam
Lyricist : Kasarla Shyam
Male Singer : Ram Miriyala
Female Singer : Satyavathi Rathod(Mangli)
Music : Bheems Ceciroleo
Actor : Priyadarshi
Director : Venu Yeldandi
Social Plugin